Monday, April 29, 2024

డిగ్రీ అడ్మిషన్లకు రేపే నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ విధానంలోనే కౌన్సెలింగ్‌..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ అడ్మిషన్లకు సంబంధించి రేపు (శుక్రవారం) నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్రంలో రెండేళ్లుగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నట్లుగానే కౌన్సెలింగ్‌ జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, అటానమస్‌ డిగ్రీ కళాశాలలన్నీ ఆర్ట్‌ ్స, సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, సోషల్‌ వర్క్‌ తదితర డిగ్రీ కోర్సుల్లోకి(హానర్స్‌తో కలిపి) అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయి, ఫలితాలు విడుదలయ్యేసరికి ఆగస్టు చివరి వరకు సమయం పట్టేలా ఉండటంతో అప్పటి వరకు విద్యార్థులు వేచి చూడకుండా ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 22న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా, 23 నుంచి 31 వరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి.

ఆగస్టు 1 నుంచి ఐదో తేదీ వరకు ఆన్‌లైన్‌లో, హెచ్‌ఎల్‌సీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, అలాగే 3, 4 తేదీల్లో స్పెషల్‌ కేటగిరి వెరిఫికేషన్‌ జరగనుంది. ఆగస్టు 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 13 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఎడిటింగ్‌, సవరణలకు అవకాశం ఉంటుంది. అదే నెల 20న సీట్ల అలాట్‌మెంట్‌ జరుగుతుంది. 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సీట్లు పొందిన విద్యార్థులు తమ తమ కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి. ఆగస్టు 25వ తేదీ నుంచి డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ పేర్కొన్నారు. స్పెషల్‌ కేటగిరి విద్యార్థులకు విజయవాడలోని ఎస్‌ఆర్‌ ఆర్‌ కళాశాల, విశాఖపట్నంలోని డా. వీఎస్‌ కృష్ణ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఆగస్టు 3, 4 తేదీల్లో జరుగుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement