Friday, March 29, 2024

డబ్ల్యూఏసీ 2022 జావెలిన్‌ త్రో ఫైనల్లో భారత అథ్లెట్‌..

వాషింగ్టన్‌: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహి అథ్లెట్‌ అన్నూ రాణి శుభారంభం చేసింది. అమెరికాలోని ఒరేగాన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ టోర్నీలో భాగంగా గురువారంనాడిక్కడ జరిగిన జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ పోటీల్లో అన్నూ రాణి రెండో ప్రయత్నంలో ఈటెను 59.06 మీటర్ల దూరం విసిరి గ్రూప్‌-బీలో 5వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఈటెను తొలి ప్రయత్నంలో 55.32 మీటర్లు విసిరినప్పటికీ… రెండో ప్రయత్నంలో మాత్రం 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌లకు అర్హత సాధించింది. ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచిన అన్నూరాణి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

దీంతో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి జావెలిన్‌ త్రో ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచింది. ఇక జపాన్‌కు చెందిన హరుకాకిటాగుచి ఈటెను 64.32 మీటర్ల దూరం విసిరి సీజన్‌ బెస్ట్‌తో తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చెందిన షియింగ్‌ లిహు (63.86 మీటర్లు), లిథువేనియాకు చెందిన లివేట జాసియునైట్‌ (63.80 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా గ్రూప్‌-ఏ, గ్రూప్‌- బీ నుంచి కలిపి 12మంది ఫైనల్లో పోటీ పడనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement