Monday, April 29, 2024

తైపీ ఓపెన్ క్వార్టర్స్‌లోకి కశ్యప్‌.. రాజవత్‌, మంజునాథ్‌, కిరణ్‌ జార్జ్‌ ఔట్‌

మాజీ కామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్టు భారత దిగ్గజ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ తైపీ ఓపెన్‌ 2022లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారంనాడిక్కడ జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ సెకండ్‌ రౌండ్‌లో కశ్యప్‌ 21-10, 21-19 తేడాతో ప్రత్యర్థి చియా హవో లీ (చైనీస్‌ తైపీ) పై ఘనవిజయం సాధించాడు. 36 నిముషాలు పాటు సాగిన మ్యాచ్‌లో ప్రారంభం నుంచి కశ్యప్‌ ఆధిపత్యం చెలాయించాడు. 2-0 తో విజయం సాధించి, క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఇక ప్రియాన్షు రాజవత్‌, మిధున్‌ మంజునాథ్‌, కిరణ్‌ జార్జ్‌ రెండో రౌండ్‌లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. రాజవత్‌ 21-19, 21-13 తేడాతో చెన్‌ చి టింగ్‌ చేతిలో పరాజయం పాలుకాగా, మంజునాథ్‌ 21-5, 21-17 తేడాతో జపాన్‌ క్రీడాకారుడు కొడాయి నరోకా చేతిలో ఓటమిని చవిచూశాడు. కిరణ్‌ జార్జ్‌ తన ప్రత్యర్థి చెన్‌ టీన్‌ చావో చేతిలో 21-23, 21-16, 7-21 తేడాతో ఓడిపోయాడు.

ఇక ఉమెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో సమియా ఇమాద్‌ ఫరూఖీ 21-18, 21-13 తేడాతో ప్రత్యర్థి వెన్‌ చి షు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది. దీంతో 5లక్షల డాలర్ల బహుమతిని చేజారిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సిక్త్‌ సీడ్స్‌ ఇషాన్‌ భట్నాగర్‌- తనీషా క్రాస్టో జోడీ 21-14, 21-17 తేడాతో విజయం సాధించింది. చైనీ తైపీ జంట చెంగ్‌ కయ్‌ వెన్‌ ఆఫ్‌ వాంగ్‌ యు ఖియాపై సునాయాసంగా గెలుపొందింది. ఉమెన్స్‌ డబుల్స్‌ విభాగంలో తనీషా క్రాస్టో శ్రుతి మిశ్రా జంట ప్రత్యర్థి చైనీస్‌ తైపీ జోడీ జియా యిన్‌ లిన్‌- లిన్‌ యు-హావో చేతిలో 21-14, 21-8 తేడాతో పరాజయం పాలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement