Sunday, April 28, 2024

రైతన్నకి అండ- టిఆర్ఎస్ ఎజెండా…మంత్రి గంగుల కామెంట్స్

కరీంనగర్: తెలంగాణ పచ్చగా ఉండడాన్ని కేంద్రంలోని బిజెపి పాలకులు చూడలేక పోతున్నారని మంత్రి గుంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు.మ‌హాధ‌ర్నాలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పార్టీని రోడ్ల పైకి తీసుకువచ్చారు..స్వయం పాలనలో రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..7 సంవత్సరాల తెరాస పాలనలో ఇప్పుడుప్పుడే రైతులు తెరిపిన పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింద‌ని మండిప‌డ్డారు. రాజ్యాంగంలో వ్యవసాయ చట్టాలు రాష్ట్రాల చేతుల్లో కాకుండా… కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారన్నారు. మద్దతు ధరతో పాటు… ధాన్యం కొనుగోలు… వాటిని నిల్వ చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలు… వాటిని నిల్వ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

కేవలం రైతుల వ్యవసాయానికి కావల్సిన సాగునీరు, విద్యుత్తు, ఎరువులు, విత్తనాలు లాంటి సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని మంత్రి తెలిపారు. కాళేశ్వరం జలాల రాక, 24 గంటల కరెంట్, రైతుపెట్టుబడి, కావలసినంత విత్తనాలు… ఎరువులు అందుబాటులో ఉండడంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగి… బీడు భూములు లేకుండా పోయాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో దిగుబడి కూడా పెరిగిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి… బియ్యంగా మార్చి ఢిల్లీకి పంపిస్తున్నాం అని చెప్పారు. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వమే నేరుగా రైతుల వద్దనుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేది..కానీ ఇప్పుడు ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది..రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రాజ్యాంగం హక్కును కల్పించింది.. ప్రతి ధాన్యం గింజను కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement