Thursday, May 16, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్సైల బదిలీ

వరంగల్, (ప్రభ న్యూస్) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.హన్మకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎస్సై గా పని చేస్తున్న జి. అనిల్ కుమార్ ను జనగామ జిల్లా నర్మెట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఆత్మకూరు పీఎస్ లో ఎసై గా ఉన్న అనిల్ కుమార్ ను నర్మెట్ట ఎస్ హెచ్ వో గా నియమించారు.

అలాగే కొంత కాలంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్లో వేకన్సీ రిజర్వులో ఉన్న ఎస్సై ఎన్.నగేశ్ ను వరంగల్ జిల్లా నల్లబెల్లి ఎస్ హెచ్ వో గా బదిలీ చేశారు.అక్కడ ఆటచ్డ్ గా ఉన్న సురేష్ ను నర్సంపేట యధాస్థానంకు పంపించారు. ఇంకా మరిన్నీ బదిలీలు జరిగే అవకాశాలున్నాయి. హసన్ పర్తి ఇన్స్ పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. హసన్ పర్తి ఇన్స్ పెక్టర్ నియామకం కోసం లోకల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సిఫార్సు లెటర్ ను ఇప్పటికే ఇచ్ఛిన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement