Wednesday, May 8, 2024

Breaking | నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ.. ఎవ‌రెవ‌రు ఎక్క‌డికి అంటే..

తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న‌ ఎనిమిది మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి రవి గుప్తా ఇవ్వాల (బుధవారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న కరుణాకర్ ను భూపాలపల్లి ఎస్పీగా, ఎస్పీగా పని చేస్తున్న సురేందర్ రెడ్డిని హైదరాబాద్ కామెంట్ కంట్రోల్ కు, వెయిటింగ్ లో ఉన్న పుష్ప ను కమాండ్ కంట్రోల్ హైదరాబాద్ కు, మేడ్చల్ డిసిపి గా పనిచేస్తున్న సందీప్ ను మాదాపూర్ డీసీపీగా పంపారు.

మాదాపూర్ డీసీపీగా పనిచేస్తున్న శిల్పవల్లిని హైదరాబాద్ అడ్మిన్ డీసీపీగా, సైబరాబాద్ వివో డబ్ల్యూ డిసిపి గా పనిచేస్తున్న కవితను ఉమెన్స్ సేఫ్టీ డిసీపీగా, రాచకొండ ట్రాఫిక్ టు డిసిపి గా పనిచేస్తున్న శ్రీనివాసులు ట్రాఫిక్ 3 డిసిపి గా, వెయిటింగ్ లో ఉన్న ప్రసన్న రాణిని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement