Thursday, May 2, 2024

చోర్ బ‌జార్ నుంచి ట్రైల‌ర్.. ఫుల్ యాక్ష‌న్ లో దిగిన ఆకాష్..

‘దళం, జార్జ్‌ రెడ్డి’ ఫేమ్ డైరెక్ట‌ర్ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో ఆకాశ్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘చోర్‌ బజార్‌’. వీఎస్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.. రామ్ మిరియాల ఆల‌పించిన జ‌డ అనే పాట‌కు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వ‌చ్చాయి.. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ‘నా పేరు బచ్చన్‌.. బచ్చన్‌ సాబ్‌.. దునియాల ప్రతివోనికీ ఏదో ఒక దూల ఉంటది.

నాకు నా చేయి దూల’ అంటూ ఆకాష్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. మాస్ యాక్ష‌న్ సీన్స్ లో ఎన‌ర్జిటిగ్ గా క‌నిపిస్తాడు ఆకాష్.. అయితే హీరోయిన్‌ మూగ అమ్మాయిగా నటించినట్లు తెలుస్తోంది. ఇక డైమండ్‌ ఎలాగైనా మ్యూజియంలో ఉండాలన్న సునీల్‌ మాటలను బట్టి దాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అసలీ డైమండ్‌ గోల తెలియాలన్నా, హీరో ప్రేమ గెలిచిందా? లేదా? అన్నది చూడాలన్నా సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement