Saturday, May 25, 2024

AP | విజయవాడ‌‌–గుంటూరు పరిధిలో ట్రాక్​ రిపేర్లు.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు!

ఆంధ్రప్రదేశ్‌లో నడిచే రైళ్లతో పాటు రాష్ట్రం మీదుగా వెళ్లే అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది. విజయవాడ, గుంటూరు డివిజన్లలో మౌలిక సదుపాయాల పనుల కారణంగా రైళ్ల రద్దు లేదా పాక్షిక రద్దు, మళ్లింపు జరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా ఇవ్వాల (ఆదివారం) వెల్లడించింది.

- Advertisement -

రైళ్ల రద్దు, దారి మళ్లింపు వివరాలు ఇవే..

నడికుడి-కాచిగూడ(07792), కాచిగూడ-నడికుడి(07791), మచిలీపట్నం-గుడివాడ(07869), గుడివాడ-మచిలీపట్నం(07868), విజయవాడ-విశాఖపట్నం(22702), విశాఖపట్నం-విజయవాడ(22701), విశాఖపట్నం-గుంటూరు(17240), గుంటూరు – విశాఖపట్నం(17239), విశాఖపట్నం-కాకినాడ ఓడరేవు(17268), కాకినాడ ఓడరేవు-విశాఖపట్నం(17267), విశాఖపట్నం-రాజమండ్రి76,(0rajhmundry7Visakhapatnam) 6) , బిట్రగుంట-విజయవాడ(07977), విజయవాడ-బిట్రగుంట(07978), చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238), బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237) రైళ్లు జూన్​ 26వ తేదీ నుంచి జులై 2 వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

అలాగే, విజయవాడ-గుంటూరు(07783), గుంటూరు-విజయవాడ(07788), గుంటూరు-మాచర్ల(07779), మాచర్ల-గుంటూరు(07780), మాచర్ల-నడికుడి(07580), నడికుడి-మాచర్ల(07579), తెనాలి-7875) , రేపల్లె-తెనాలి (07876), గుంటూరు-డాన్ (17228) రైళ్లు 26 నుంచి వచ్చే నెల 2 వరకు రద్దు చేయబడ్డాయి. డోన్-గుంటూరు (17227) రైలు జూన్​ 27వ తేదీ నుంచి జూలై 3వ తదీ వరకు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 26 నుంచి 2వ తేదీ వరకు నర్సాపూర్-గుంటూరు (17282), గుంటూరు-నర్సాపూర్ (17281) రైళ్లను రద్దు చేశారు.

ఈ నెల‌ 28 నుంచి జేలై 6వ తేదీ వరకు గుంటూరు-కాచిగూడ (17251), కాచిగూడ-గుంటూరు (17252) రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే రేపల్లె-మార్కాపురం (07889), మార్కాపురం-తెనాలి (07890) రైళ్లను గుంటూరు-మార్కాపురం, మార్కాపురం-గుంటూరు మధ్య 26 నుంచి వచ్చే 2వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు. అలాగే హుబ్లీ-విజయవాడ (17329) రైలు 26 నుంచి 4 వరకు నంద్యాల-విజయవాడ మధ్య పాక్షికంగా, విజయవాడ-హుబ్లీ (17330) రైలు 27 నుంచి 5వ తేదీ వరకు విజయవాడ-నంద్యాల మధ్య పాక్షికంగా రద్దయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement