Saturday, May 4, 2024

టామాటా రేటు వింటేనే భయమేస్తోంది.. మార్కెట్​లో అన్నిటికంటే ఇదే పిరం!

ప్రభన్యూస్‌ : నిత్యావసర సరుకుల ధరలకు తోడు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యుడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇందుకు కారణం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు వాపోతున్నారు. నిత్యావసర సరుకులు కూరగాయల ధరలు పెరిగిపోవడంతో మధ్యతరగతి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. టమాట కిలో ధర 80కిపైగా పలుకుతుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందనంటోంది. స్థానికంగా టమాట దిగుబడి తగ్గిపోవడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఎండలు అధికంగా ఉండటంతో పూత రాలి పోవడంతో దిగుబడి తగ్గింది. నెల రోజుల క్రితం రూ.30 టమాటా కిలో ధర వారం రోజుల క్రితం రూ.30 నుంచి రూ.35 వరకు ఉండింది. అంతకుముందు రంజాన్‌ పండగ సమయంలో కిలో ధర రూ.50 నుంచి రూ.60 వరకు కొనసాగింది. ప్రస్తుతం అమాంతం పెరిగి రూ.80కిపైగా చేరింది.

గతంలో 25 కిలోల టమాట బాక్స్‌ ధర రూ.1200 నుంచి రూ.1400 పలికింది. ప్రస్తుతం అదే బాక్స్‌ ధర రూ.2,000 నుంచి రూ.2,200 వరకు పలుకుతోంది. దీనితో వ్యాపారులు మార్కెట్‌లో రూ.100 నుంచి 110 వరకు విక్రయిస్తున్నారు. స్థానికంగా దిగుబడి తగ్గిపోవడంతో స్థానిక వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా బాగా పెరిగాయి. పచ్చి మిరపకాయల ధర కిలో రూ.50 పలుకుతోంది. క్యారెట్‌, బీట్‌రూట్‌ ధరలు రూ.60కి పైగా ఉన్నాయి. నిమ్మకాయలు పది రూపాయలకు రెండు చొప్పున అమ్ముతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement