Friday, May 3, 2024

ఈ రోజే శని అమావాస్య.. సూర్యగ్రహణం కూడా..

ఈరోజు (శనివారం) ఆకాశంలో అద్భుతమై దృశ్యం క‌నిపించ‌నుంది. అమావాస్య‌తోపాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. ఉదయం 10:59 నిమిషాల నుంచి.. సాయంత్రం 3:07 వరకు ఇది సుదీర్ఘంగా కొన‌సాగుతుంద‌ని శాస్త్రవేత్త‌లు తెలిపారు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కూడా ఇదే కావడం విశేషం. సాధారణంగా సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు అడ్డు రావడం వల్ల సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. సరిగ్గా అమావాస్య రోజు మాత్రమే ఈ గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్ర‌హ‌ణం భార‌త దేశంలో ఏమాత్రం క‌నిపించే అవ‌కాశాలు లేవు.

అంటార్కిటికా నుంచి ఆస్ట్రేలియాలో పాక్షికంగా, దక్షిణాఫ్రికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల దక్షిణ ప్రాంతంలో ఈ గ్ర‌హణం పాక్షిక దశలను చూడొచ్చు. అయితే.. ఈ ఏడాది జూన్ 10 న ఇండియాలో సూర్యగ్రహణం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న‌వారికి మాత్రమే ఇది కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement