Wednesday, May 15, 2024

సబర్మతి నదీ తీరంలో టైటాన్స్ సంబ‌రాలు… ఐపీఎల్‌ టైటిల్‌తో భారీ రోడ్‌ షో..

ఐపీఎల్‌ ట్రోఫీని గుజరాత్‌ టైటాన్స్‌ ముద్దాడటంతో ఆ జట్టులోని ప్రతీ ఒక్కరితో పాటు ఆ రాష్ట్రంలోని అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. సొంత గడ్డపై.. సీజన్‌ ఎంట్రీతోనే టైటిల్‌ సాధిం చడం ఆశామాషీ విషయం కాదని క్రికెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్‌ టైటిల్‌తో అహ్మదాబాద్‌లోని సబర్మతీ నదీ తీరంలో రోడ్‌ షో నిర్వహించారు. దీనికి ముం దు గుజరాత్‌ సీఎం భూపేం ద్ర భాయ్‌.. జట్టుకు టైటిల్‌ అందజేసి సభ్యులను అభినందించారు. ఐపీఎల్‌ క్రికెట్‌ ఫైనల్స్‌లో గెలుపొం దిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు.. సోమవారం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా సీజన్‌ మొత్తంలో ఆల్‌ రౌండర్‌ షో కనబర్చాడు. దీనికితోడు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ముందుకు నడిపిం చాడు. దీంతో దేశ వ్యాప్తంగా తాజా, మాజీ క్రికెట్‌ దిగ్గజాలు హార్దిక్‌ పాండ్యాను పొగడ్తలతో ముంచేస్తు న్నారు. ఈ టైటిల్‌ ఎంతో ప్రత్యేకం అని, సరికొత్త చరిత్రను సృష్టించిందని, దీని గురించి రానున్న తరం కూడా మాట్లాడుకుంటుందని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చెప్పుకొచ్చారు.

విజయాలు ఎంతో ప్రత్యేకం..

ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ విజయపరంపర, ఆడిన తీరు, అద్భుత విజయా లు ఎంతో ప్రత్యేకం అని, ప్రతీ ఒక్కరు వీటిని గుర్తుంచుకుం టారని వివరిం చారు. గుజరాత్‌ జట్టు ప్రకటనతో పాటు వేలం ముగి సిన తరువాత.. జట్టును ఎలా ముందుండి నడిపిం చాలో ఉన్న దానిపైనే దృష్టి సారించానని, నెంబర్‌ 4 బ్యాటర్‌ గా వచ్చేందుకు తాను ఎప్పుడో నిర్ణయించు కున్నా అని హార్ధిక్‌ పాండ్యా తెలిపారు. ముంబై ఇండియన్స్‌లో హార్దిక్‌ పాండ్యా ఉన్న సమయం లో కూడా నాలుగు సార్లు టౖౖెటిల్‌ ముద్దాడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement