Sunday, May 5, 2024

ఈసారి అంద‌రి అంచనాలకు మించి.. ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతున్న మూవీ ‘భ‌గ‌వంత్ కేప‌రి’. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అలాగే ప్రమోషన్స్ ని జోరుగా సాగిస్తున్నారు మేక‌ర్స్. ఇక‌ తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి టైం ఫిక్స్ చేశారు.

ఈ నెల 8వ తేదీన‌ భగవంత్ కేసరి ట్రైలర్ బ్లాస్ట్‌ జరగబోతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈసారి అందరి అంచనాలకు మించి బాలయ్యని ఒక సరికొత్త‌ యాంగిల్ లో చూడబోతున్నారు అంటూ మేకర్స్ తెలియజేస్తున్నారు. కాగా ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వరంగల్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించనున్నట్టు తెలుస్తొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement