Wednesday, May 15, 2024

T20 World Cup | టీ20 వరల్డ్‌కప్‌ ఫుల్ షెడ్యూల్ ఇదే !

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది. USA మరియు కరేబియన్ దీవులలో జరిగే ఈ మెగా టోర్నమెంట్ జూన్ 1న ప్రారంభమై జూన్ 29న ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభ‌జించ‌గా..

  • గ్రూప్‌-ఏలో భారత్‌, పాక్‌లతో పాటు ఐర్లాండ్‌, కెనడా, యూఎస్‌ఏ జట్లు
  • గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో పాటు నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌ జట్లు..
  • గ్రూప్‌-సిలో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, ఉగాండ, పపువా న్యూ గినియా..
  • గ్రూప్‌-డిలో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో పాటు బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ జట్లు ఉన్నాయి.

ఈ టోర్నీలో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు జూన్‌ 1 నుంచి 18 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌, సూపర్‌ 8 దశ మ్యాచ్‌లు జూన్‌ 19 నుంచి 24 వరకు జరుగుతాయి. జూన్‌ 26, 27 తేదీల్లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనుండగా.. జూన్‌ 29న ఫైనల్‌ జరుగుతుంది. మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో యూఎస్‌ఏ – కెనడా జట్టు తలపడనున్నాయి.

మెగా టోర్నీ గ్రూప్‌ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..

- Advertisement -

జూన్‌ 5: భారత్‌​ వర్సెస్‌ ఐర్లాండ్‌ (న్యూయార్క్‌)
జూన్‌ 9: భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (న్యూయార్క్‌)
జూన్‌ 12: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (న్యూయార్క్‌)
జూన్‌ 15: భారత్‌ వర్సెస్‌ కెనడా (ఫ్లోరిడా)

Advertisement

తాజా వార్తలు

Advertisement