Monday, April 29, 2024

జులైలో లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. బ‌డ్జెట్ మిడ్ రేంజ్ లోనే ధ‌ర‌!

జులై నెల ప్రారంభ‌మ‌య్యింది. ఈ నెలలో కొన్ని అదిరిపోయే ఫోన్లు లాంఛ్ కానున్నాయి. ఐక్యూ, వన్ ఫ్లస్, నథింగ్ వంటి సంస్థలు ఈ నెలలో తమ కంపెనీల నుండి స్మార్ ఫోన్స్ ను రిలీజ్ చేయనున్నాయి. ఈ మెుబైల్స్ అన్నీ మంచి ఫ్రోసెసర్స్ & ఫీచ‌ర్స్ తో వస్తున్నాయి. అంతేకాకుండా.. ధరలు కూడా బ‌డ్జెట్ మిడ్ రేంజ్ లోనే ఉండే అవకాశం ఉంది. మ‌రి ఈ నెలలో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు ఏంటో ఓ చూద్దా..

- Advertisement -

  • ఐక్యూ నియో 7 ప్రో

ఈ నెల (జూలై) 4న ఇండియాలో లాంఛ్ అవ్వనుంది. స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ 1 ప్రోసెసర్ తో వస్తుంది. అంతేకాకుండా ఇది “ఇండిపెండెంట్ గేమింగ్ చిప్”ని కలిగి ఉంటుంది. ఈ మెుబైల్ 120Hz అమెలోడ్ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రాబోతుంది. మెయిన్ కెమెరా 50 మెగాఫిక్సల్ తోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాఫిక్సల్ ఉంటుంది.

  • వన్ ఫ్లస్ నార్డ్ 3

ఈ మొబైట్ జూలై మెుదటి వారంలోనే లాంచ్ అయ్యే చాన్స్ ఉంది. వన్ ఫ్లస్ నార్డ్ 3 మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ సెట్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా 64 మెగాఫిక్సల్, ప్రంట్ కెమెరా 16 మెగాఫిక్సల్ తో ఉండ‌నుంది. అండ్రాయిడ్ 13 వెర్షన్ తో 5000mAh బ్యాటరీ, 80W ఫాస్టింగ్ ఛార్జింగ్ సపోర్టుతో రాబోతుంది.

  • నథింగ్ ఫోన్ (2)

స్మార్ట్ ఫోన్ ప్రియులు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెుబైల్స్ లో నథింగ్ ఫోన్ (2) కూడా ఒకటి. ఈ మొబైల్ ఫోన్ జూలై 11న మార్కెట్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ సంబంధించి ప్రీ ఆర్డర్స్ జూన్ 29 నుంచి మెుదలయ్యాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్ సెట్ తో రాబోతుంది. 4,750mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. ఇది “గ్లిఫ్ ఇంటర్‌ఫేస్”ని కలిగి ఉంటుంది. జూలై విడుదలయ్యే ఫోన్స్ లో ఇది బెస్ట్ గా నిలిచే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement