Friday, April 26, 2024

వీళ్లు మామూలోళ్లు కాదు.. జాబ్ కోసం యువ‌త అడ్డదారులు..!

ఎలాగైనా జాబ్ కొట్టేయాల‌ని కొంద‌రు యువ‌కులు అడ్డ‌దారులు తొక్కి బుక్క‌య్యారు. కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్‌, మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసి 1,619 ఉద్యోగాలను ఫిట్‌నెట్‌ పరీక్షల ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు అభ్యర్థులు నిర్ణీత ఎత్తు, బ‌రువు 55 కిలోలు ఉండాలని నిర్దేశించింది. కలబురిగి జిల్లాలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వ‌హిస్తున్న క్ర‌మంలో ప‌లువురు యువ‌కులు పోలీసుల‌కు షాకిచ్చారు. బరువు సరిపోవడం కోసం నలుగురు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారు. టెస్ట్ లో అర్హత సాధించేందుకు తగినంత బరువు లేని కొంద‌రు అభ్య‌ర్థులు లోదుస్తుల్లో తూకపు రాళ్లు, నడుంకు ఇనుప బెల్ట్‌, బరువైన చొక్కా, ఐదేసి కిలోల బరువున్న తూకపు రాళ్లు లోదుస్తుల్లో పెట్టుకుని ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరయ్యారు. అధికారులు వీరిని గుర్తించి ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement