Tuesday, May 14, 2024

పరీక్షలు ఒకవైపు, ఫలితాలు మరోవైపు.. శరవేగంగా అడుగులేస్తున్న విద్యాశాఖ

తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి.. మరో వైపు పరీక్షల ఫలితాలను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇలా వరుసగా.. మొన్న ఇంటర్, నిన్న పది ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ నేడు టెట్ ఫలితాలను కూడా విడుదల చేసింది. జూన్ 12వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరిగాయి. పేపర్-1కు 3 లక్షల 18 వేల 506 మంది హాజ‌రుకాగా.. పేపర్-2కి 2 లక్షల 51 వేల 70 మంది హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. పేపర్-1పై 7 వేల 930.. పేపర్-2పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. రెండు రోజుల క్రితం తుది కీ విడుదల చేశారు. ఈ తుది కీలో రెండు పేపర్లలో 13 ప్రశ్నలకు మార్పులు చేశారు. ఫలితాల కోసం www.tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement