Saturday, May 11, 2024

రద్దయిన ఎంబీబీఎస్‌ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం.. నోటిఫికేషన్ల జారీ చేసిన కాళోజీ వర్సిటీ

వరంగల్‌, ప్రభన్యూస్‌ : రాష్ట్రంలోని రెండు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను రద్దు చేస్తూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిర్ణయించిన నేపథ్యంలో రద్దయిన సీట్లను సర్దుబాటుచేసే ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఆయా కళాశాలల విద్యార్దుల సీట్ల సర్దుబాటుకు ఎన్‌ఎంసీ ఈనెల 25న రాష్ట్ర ప్రభ ుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మెడికల్‌ కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ఆధారంగా సీట్ల సర్దుబాటుకు కాళోజీ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్లు విడుదల చేసింది.

మహావీర్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, టిఆర్‌ఆర్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో కన్వీనర్‌, యాజమాన్య కోటా క్రింద 2021- 22వ సంవత్సరంలో ప్రవేశం పొందిన ఎంబీబీఎస్‌ విద్యార్దులను రాష్ట్రంలోని 13 వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈనెల 29న ఉదయం 9 గంటల నుంచి 30న సాయంత్రం 6 గంటల వరకు కళాశాలల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, అభ్యర్దుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు యూనివర్సిటీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement