Sunday, April 28, 2024

ఈ-పంట నమోదులో కర్నూల్‌ జిల్లా టాప్‌.. 4.50 లక్షల ఎకరాల్లో నమోదు

కర్నూల్‌, ప్రభన్యూస్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ పంట నమోదులో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 98 లక్షల 27,9504 ఎకరాలలో పంటలు సాగు కాగా, ఈ పంట 34 లక్షల 18, వేల 405 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు అప్లోడ్‌ చేయగా. కర్నూలు జిల్లాలో 9, లక్షల 53 వేల 3 33. ఎకరాల్లో పంటలు సాగు కాగా 25 మండలాలలో 4 లక్షల 50 వేల 403 ఎకరాలలో ఈ పంట నమోదు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ సిహెచ్‌ హరికిరణ్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు. జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారిని పి.లలిత వరలక్ష్మి ఆదేశాల మేరకు 25 మండలాల్లో ఈ పంట నమోదుకు సంబంధించి రెవెన్యూ వ్యవసాయ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేశారు.

నిత్యం పది శాతం ఈ పంట నమోదు చేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిపారు. ముందుగా వెబ్లాండ్‌ ఆధారంగా పంటల వివరాలు సేకరించి. క్షేత్రస్థాయిలో సాగు చేసిన రైతుతో కలిసి పంటల వివరాలను ఆర్‌బి యుడిపి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. సాంకేతిక సమస్య. ఉన్న సమయంలో ఆఫ్‌లైన్‌లో వివరాలు సేకరించి. అనంతరం సంబంధిత ఆర్‌.బి.కెల్లో పంటల వివరాలను ఈ పంటలో నమోదు చేస్తున్నారు కర్నూలు జిల్లాలోని 25 మండలాల్లో ఉండగా ఆలూరు డివిజన్‌లో 85 శాతం నమోదు చేశారు. జిల్లాలో అతి ఎక్కువగా ఆదోని మండలంలో 70,219 ఎకరాలు ఉండగా 30 వేల ఎకరాల్లో ఈ పంట నమోదు చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా ఈ పంట నమోదు సంబంధించి కర్నూలు జిల్లా టాప్‌లో ఉండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement