Tuesday, May 7, 2024

Baby Tigers: త‌ల్లికోసం పులి పిల్ల‌ల ఆరాటం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం వద్ద లభించిన పులి పులి పిల్ల‌లు త‌మ త‌ల్లికోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఆ పులి పిల్లలను అధికారులు ఆత్మకూరుకు తరలించారు. ఆత్మకూరు డీఎఫ్ఓ ఆఫీసులో పులి పిల్లలకు షెల్టర్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం అటవీ సిబ్బంది సంరక్షణలో పులి పిల్లలున్నాయి. పెద్ద పులి వద్దకు పులి పిల్లలను చేర్చేందుకు ప్రయత్నిస్తున్న అటవీ సిబ్బంది.. ఈ మేరకు పెద్ద పులి జాడ తెలుసుకునేందుకు పెద్ద గుమ్మడాపురంలో 40 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అటు పులి పిల్లలకు ఆహారం అందిస్తున్నారు అటవీ అధికారులు. పెద్ద పులి జాడ దొరకని పక్షంలో 4 పిల్లలను తిరుపతి జూకు తరలించే యోచనలో అటవీ అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement