Sunday, April 28, 2024

పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : మంత్రి త‌ల‌సాని

న‌గ‌రంలో హోలీ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అంద‌రూ రంగులు చ‌ల్లుకుంటూ ఆనందంగా గ‌డిపారు. హైద‌రాబాద్‌లోని ఇందిరా పార్కులో జ‌రిగిన హోలీ వేడుక‌ల్లో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు కార్పొరేట‌ర్లు పాల్గొని ఉత్సాహంగా గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మంత్రి త‌ల‌సాని హోలీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌న సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను పండుగ‌లు చాటి చెబుతాయ‌ని త‌ల‌సాని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉంద‌ని త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement