Tuesday, May 14, 2024

Breaking | మంత్రి గంగుల ఎన్నిక చెల్ల‌దు.. హైకోర్టులో బండి సంజ‌య్ పిటిష‌న్‌

బీఆర్ ఎస్ నేత‌, మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఎన్నిక చెల్ల‌ద‌ని ఇవ్వాల (సోమ‌వారం) తెలంగాణ‌ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. క‌రీంన‌గ‌ర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజ‌య్ ఈ పిటిష‌న్ వేశారు. దీన్ని స్వీక‌రించిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. కాగా, రిటైర్డ్ జిల్లా న్యాయ‌మూర్తి శైల‌జ‌తో హైకోర్టు క‌మిష‌న్ ఏర్పాటు చేసింది. ఆగస్టు 12 నుంచి 17వ తేదీ వ‌ర‌కు క్రాస్ ఎగ్జామినేష‌న్ పూర్తి చేయాల‌ని ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన త‌దుప‌రి విచార‌ణ ఆగ‌స్టు 21వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement