Sunday, May 19, 2024

బౌల‌ర్ల ధాటికి కుప్ప‌కూలిన బంగ్లా.. శ్రీలంక ముందు స్వల్ప టార్గెట్

ఆసియాకప్ 2023 లో భాగంగా బంగ్లా-శ్రీలంక మధ్య జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్ జ‌ట్టు కుప్పకూలింది. మెద‌ట‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జ‌ట్టు 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ షాంటో 122 బంతుల్లో 89 ప‌రుగుల‌తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నజ్ముల్ మినహా మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు. శ్రీలంక బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ బ్యాటర్లను కనీసం క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం కూడా చేయలేదు. శ్రీలంక‌ బౌలర్ మతీశ పతిరణ 4 వికెట్లతో మెరిశాడు. తీక్షణ 2 వికెట్లు సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement