Tuesday, April 30, 2024

రాత్రి కారు ఆగిపోయింది… ఉదయం వచ్చి చూస్తే కారులో డెడ్ బాడీ

హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 304 వద్ద ఓ కారులో గుర్తు తెలియని మృతదేహం లభించింది. అయితే ఆ మృతదేహం ఒంటి పైన దుస్తులు లేకపోవడం ఒక్క గాయం కూడా లేక పోవటం పలు అనుమానాలకు దారి తీస్తుంది. రాత్రి సమయంలో కారు ప్రాబ్లమ్ వచ్చి స్టార్ట్ కాకపోవడంతో కారు ను అక్కడే డ్రైవర్ వదిలి వెళ్లారు.

అయితే ఉదయం మెకానిక్ ను తీసుకొని వచ్చే చూసేసరికి కారులో మృతదేహాలు ఉండడంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాడు.సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement