Tuesday, October 8, 2024

ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు అంకితం – కెటిఆర్..

ఖ‌మ్మం : ఖ‌మ్మంలోని పేద ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల స‌ముదాయాన్ని మంత్రి కెటిఆర్ అంకిత‌మిచ్చారు.. ఖ‌మ్మం అర్బ‌న్ మండ‌లం టేకుల‌ప‌ల్లిలో రూ. 60.20 కోట్ల‌తో నిర్మించిన 1,004 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, ప్ర‌శాంత్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ క‌లిసి ప్రారంభించారు. టేకులపల్లిలో డబుల్‌బెడ్‌రూం గృహ లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ సెంటర్లను, ప్రాథమిక ఉప కూరగాయల మార్కెట్‌ను మంత్రులు సందర్శించి వాటిని ప్రారంభించారు. అలాగే ఈ గృహాల‌ను ల‌బ్ద‌దారుల‌కు వెంట‌నే అంద‌జేసి గృహ ప్ర‌వేశాలు చేయించాల‌ని కెటిఆర్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.. ఇక ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న‌లో శ్రీశ్రీ సర్కిల్‌ నుంచి వీ.వెంకటాయపాలెం వరకు 4.4కిలో మీటర్ల నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులకు రూ.35 కోట్లు మంజూరు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement