Saturday, May 4, 2024

మంచుకు తగిలిన స్టీల్ సెగ

విశాఖ స్టీల్ సెగ హీరో మంచు విష్ణు కు తాకింది. మోసగాళ్లు సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖకు మంచు విష్ణు, హీరో నవదీప్ వచ్చారు. అది తెలిసిన ఆందోళన కారులు నోవాటెల్ వద్ద కారును అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని వినతి పత్రం చేశారు. చిరంజీవి, ఆర్ పి పట్నాయక్, నారా రోహిత్, శివాజి మద్దతు తెలిపారని, మీరు కూడా మాకు మద్దతు తెలపాలని వారంతా కోరారు. గత కొన్నిరోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement