Saturday, May 25, 2024

అటు యుద్ధం.. ఇటు వినోదం, పుతిన్‌ ప్రేయసి కోసం అలినా ఫెస్టివల్‌!

మాస్కో:ఉక్రెయిన్‌పై దండయాత్రలో పెద్దఎత్తున సైనికులు మరణిస్తున్నా పట్టించుకోని రష్యా అధ్యక్షుడు తన ప్రేయసి కోసం మాత్రం జిమ్నాస్టిక్స్‌ పండుగను నిర్వహించేందుకు ఆదేశాలివ్వడం విమర్శలు తావిచ్చింది. పుతిన్‌ సారథ్యంలోని యునైటెడ్‌ రష్యా పార్టీ తరపున ఎంపీగా ఎన్నికైన అలినా కబయేవా పేరు తెలియనివారుండరు. పుతిన్‌ ప్రేయసిగా ఆమె పేరు అందరికీ పరిచయమే. ప్రస్తుతం ఆమె గౌరవార్థం జిమ్నాస్టిక్స్‌ పండుగ నిర్వహించారన్న విషయాన్ని న్యూయార్క్‌ పోస్ట్‌ బయటపెట్టింది. ఈ పండుగకు అలినా ఫెస్టివల్‌ అన్న పేరు పెట్టారని కూడా ఆ కథనంలో పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసింది. అందులో కబయేవా కన్పించడమేకాకుండా రెండో ప్రపంచ యుద్ధంలోని విజయగీతాలను ఆలపించారని చెప్పింది.

పైగా ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యా జడ్‌ అనే ఇంగ్లీషు అక్షరాన్ని పోలిన సంకేతాన్ని విస్తృతంగా వాడుతోంది. దీనిని రష్యా విజయానికి గుర్తుగా వాడుకలోకి వచ్చింది. అయితే, జిమ్నాస్టిక్‌ వేడుకలో పాల్గొన్న కబయేవా పాల్గొన్న వేదిక వెనుక ఆ జడ్‌ సంకేతం కన్పించడం గమనార్హం. మేలో ఈ వేడుక నిర్వహించినట్లు చెబుతుండగా రష్యా అధికార టీవీ చానెళ్లు మాత్రం అంతర్జాతీయ చిన్నారుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంగా చెప్పుకొచ్చింది. పుతిన్‌ వయసు 69 ఏళ్లు కాగా, కబయేవా వయసు 38. ఆమెకు ముగ్గురు పిల్లలున్నట్లు చెబుతారు. క్రెవ్లిున్‌ సానుకూల మీడియా సంస్థకు ఆమె చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గత డిసెంబర్‌లో ఇదే వేదికగా జరిగిన కార్యక్రమంలో కన్పించిన ఆమె ఇప్పటివరకు మళ్లి బయటకు రాలేదు. యుద్ధం నేపథ్యంలో పిల్లలతోసహా ఆమెను స్విట్జర్లాండ్‌లోని విలాసవంతమైన భవనానికి తరలించినట్లు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement