Monday, June 10, 2024

SRH vs RR: షిమ్రన్‌ హెట్‌మెయిర్‌కు బీసీసీఐ ఫైన్

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రయాణం ముగిసిపోయింది. క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమి పాలైన సంజూ శాంసన్‌ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా ఈసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాలన్న కల కలగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే.. ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్‌ ఆటగాడు షిమ్రన్‌ హెట్‌మెయిర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌ నిర్వాహకులు అతడికి జరిమానా విధించారు.

హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించడంతో మ్యాచ్ ఫీజులో 10శాతం కోత విధించింది. కాగా అభిషేక్ శర్మ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాక క్రీజును వీడే సమయంలో బ్యాట్‌తో వికెట్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అతడికి జరిమానా విధించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement