Thursday, May 30, 2024

AP : విజ‌య‌వాడ… జ‌ల‌దిగ్బంధం

విజ‌య‌వాడ‌లో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. ఇవాళ ఉద‌యం నుంచి వ‌ర్షం ప‌డుతుంది. దీంతో ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌య‌మ‌య్యాయి. దీంతో లోత‌ట్టు ప్రాంతాలన్ని జ‌ల‌దిగ్భందంగా మారాయి. అలాగే రోడ్ల‌పై నీరు చేర‌డంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

బెంజి సర్కిల్‌, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది.
మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి చెరువు అలుగు పారుతోంది. విడపనకల్లు మండలంలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలాయి. దీంతో 19 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెంచులపాడు-పొలికి, పాల్తూరు-గోవిందవాడ గ్రామాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement