Thursday, May 2, 2024

ప్రతిరోజు రాష్ట్రప్రభుత్వంపై రూ.87 కోట్ల‌కు పైగా వ‌డ్డీ..

తమిళనాడులో రాష్ట్ర అప్పులపై ఆర్థిక మంత్రి త్యాగ‌రాజ‌న్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో అన్నాడీఎంకే ప్ర‌భుత్వం ప‌దేళ్ల‌లో పెద్ద మొత్తంలో అప్పులు చేసింద‌ని అన్నారు. గ‌త ఐదేళ్ల‌లో 3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పులు చేసిన అన్నాడీఎంకే ప్ర‌భుత్వం అందులో 50 శాతం నిధుల‌ను రోజువారీ ఖ‌ర్చుల‌కు వినియోగించ‌డం వ‌ల‌న రెవిన్యూలోటుగా మారింద‌ని అన్నారు.  రాష్ట్రంలోని 2.16 కోట్ల కుటుంబాల్లో ఒక్కొక్క కుటుంబంపై రూ.2.63 ల‌క్ష‌ల రుణం ఉన్న‌ట్టుగా గ‌ణాంకాలు చెబుతున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. సాంకేతికంగా ధ‌నిక రాష్ట్ర‌మైనప్పటికి త‌మిళ‌నాడులోని మౌళిక వ‌స‌తుల వినియోగంపై గ‌త ప్ర‌భుత్వం దృష్టిసారించ‌లేక‌పోయింద‌ని, ఫ‌లితంగా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అప్పులు చేసింద‌ని ఆయన అన్నారు.  గ‌త ప్రభుత్వం చేసిన అప్పుల కార‌ణంగా ప్ర‌తిరోజు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.87 కోట్ల‌కు పైగా వ‌డ్డీని చెల్లించాల్సి వ‌స్తుంద‌ని ఆర్ధిక‌శాఖ మంత్రి త్యాగ‌రాజ‌న్ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: బూర్జ్‌ ఖలీఫాపై ఎమిరేట్స్‌ యాడ్‌ నిజమే..

Advertisement

తాజా వార్తలు

Advertisement