Thursday, April 25, 2024

బూర్జ్‌ ఖలీఫాపై ఎమిరేట్స్‌ యాడ్‌ నిజమే..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పింది బూర్జ్‌ ఖలీఫా. దీని ఎత్తు 828 మీటర్లు. మామూలుగా అయితే బూర్జ్ ఖలీఫా టాప్ కి ఎవరికి అనుమతి లేదు.. అత్యంత ధైర్యసహసాలు కలిగిని వారికి మాత్రమే ఇక్కడ అనుమతి లభిస్తుంది. అయితే తాజాగా ఎమిరేట్స్‌ మిమానయాన సంస్థ బూర్జ్‌ ఖలీఫా టాప్ లో ఓ యాడ్ ని చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు. ఈ యాడ్‌లో ఎయిర్‌ హోస్టెస్‌ నిల్చుని… ఎమిరేట్స్‌ విమానాల్లో దుబాయ్‌ రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆహ్వానం పలుకుతుంది. చివరల్లో ఒక్కసారిగా కెమెరా జూమ్‌ అవుట్‌ అవగానే భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై ఆ ఎయిర్‌ హోస్టెస్‌ నిల్చుని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో నిలబడి ఆకాశయానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా యాడ్‌ ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పిన బూర్జ్‌ ఖలీఫాపై ఈ యాడ్‌ను చిత్రీకరించారు.  దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో అత్యంత ప్రమాదకరంగా భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో చిత్రీకరించిన ఈ యాడ్‌ నిజం కాదంటూ అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ యాడ్‌కి సంబంధించి వివరాలను ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ వెల్లడించింది. 

దీంతో ఎమిరేట్స్‌ ఈ అడ్వర్‌టైజ్‌మెంట్‌ని చూసినవారంతా యాడ్‌ బాగుందని మెచ్చుకన్నప్పటికీ ఇది నిజం కాదని, గ్రాఫిక్స్‌ అంటూ అనుమనాలు వ్యక్తం చేశారు. అంతే కాదు అంత ఎత్తులో షూటింగ్ చేయడం ప్రమాదకరమని.. ఎయిర్‌ హోస్టెస్‌ ఏమైనా అయ్యుంటే పరిస్థితి ఏంటని అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ యాడ్‌ షూట్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎమిరేట్స్‌ విడుదల చేసింది. ఈ యాడ్ కోసం నెలల తరబడి రిహార్సల్‌ నిర్వహించింది ఎమిరేట్స్‌. యాడ్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించిన స్మిత్‌ లుడ్‌విక్‌కి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకునే ఈ యాడ్‌ షూట్‌ చేశామంటూ ఎమిరేట్స్‌  వీడియో రిలీజ్‌ చేసింది. అడ్వర్‌టైజ్‌మెంట్‌తో పాటు ఇప్పుడీ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ షూటింగ్‌ సందర్భంగా బుర్జ్‌ ఖలీఫాలో 160వ అంతస్థు నుంచి నిచ్చెనపై పైకి చేరుకునేందుకే గంటకు పైగా సమయం పట్టిందని స్మిత్‌ లుడ్‌విక్‌ తెలిపింది. 

ఇది కూడా చదవండి: ఓబీసీ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు..

Advertisement

తాజా వార్తలు

Advertisement