Sunday, May 5, 2024

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

కరోనా వైరస్ విజృంభిస్తున్నా విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామని ఏపీ సర్కారు మరోసారి క్లారిటీ ఇచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే గత ఏడాది ఉన్న 11 పరీక్షలను అధికారులు 7కు కుదించారు.


టెన్త్ పరీక్షల షెడ్యూల్: జూన్ 7- ఫస్ట్ లాంగ్వేజ్, జూన్ 8- సెకండ్ లాంగ్వేజ్, జూన్ 9-ఇంగ్లీష్, జూన్ 10- గణితం, జూన్ 11- భౌతిక శాస్త్రం, జూన్ 12-జీవ శాస్త్రం, జూన్ 14-సోషల్.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్: మే 5-22 వరకు ఫస్ట్ ఇయర్, మే 5-23 సెకండ్ ఇయర్.


కాగా పరీక్షల సందర్భంగా ఆయా విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని.. అలా పాటించని స్కూళ్లు, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement