Thursday, April 25, 2024

రామరాజు ఫర్ భీమ్ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా ఈ టీజర్ 1.2 మిలియన్ లకు పైగా లైక్ లను సాధించింది. ఈ ఘనతను కేవలం 11 రోజులకే సాధించగలిగింది.

అయితే ఇది ఇలా ఉండగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ సినిమా నుంచి విడుదలైన రామరాజు ఫర్ భీమ్ వీడియో 40 రోజులలో ఆ మార్కును అందుకోగా ఇప్పుడు పుష్ప మాత్రం 11 రోజులకే క్రాస్ చేసింది. అంతేకాకుండా టాలీవుడ్ లో అత్యంత వేగంగా 44 ప్లస్ మిలియన్ల వ్యూస్ సాధించిన ఘనత ను కూడా పుష్ప సొంతం చేసుకుంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement