Monday, April 29, 2024

తెలంగాణ లో రేపే పది ఫలితాలు

తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా గ్రేడింగ్ విధానంలో ఫలితాలుంటాయని క్లారిటీ ఇచ్చింది. ఇంకా కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు తెలిపింది.

ఫార్మేటివ్ అసైన్మెంట్ ఎఫ్ ఏ 1 ఆధారంగా విద్యార్థులకు విద్యా శాఖ మార్కులు కేటాయించి గ్రేడ్ ఖరారు చేసింది. ఇక దాదాపుగా సగం మందికిపైగా విద్యార్థులకు ఈసారి 10 జీపీఏ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పరీక్ష ఫీజు చెల్లించిన 521398 విద్యార్థులను ఉత్తీర్ణులు గా పరిగణించి ఈ గ్రేడులు కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement