Friday, May 10, 2024

నేడు రేపు మండుటెండలు

అపుడే ఎండలు దంచుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో పాటు గాలిలోని తేమ శాతంలో కూడా హెచ్చు తగ్గులుంటున్నాయి. దీంతో నేటి నుంచి ఎండల తీవ్రత ఎక్కువవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు, రేపు 37 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయని
అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే గురువారం నాడు భద్రాచలంలో 40.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.

ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రతాపం చూపించే భానుడు ఈ సారి ముందు నుంచే నిప్పులు చిమ్ముతున్న నేపథ్యంలో ఈసారి వేసవికాలం ఎండలు అధికంగానే ఉండనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగు
తున్నాయి.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.6 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. శుక్ర వారం రామగుండంలో 39.6, భద్రాచలంలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement