Saturday, May 11, 2024

ప్రైవేటు రంగంలో టెలికాం వ్యవస్థ..

భారత దేశంలో టెలికమ్యూనికేషన్‌ రంగంలో అతి పురాతన మైనది డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్‌ సంస్థ. దానిని 2000 సంవత్సరంలో ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించుకోని భారత సంచార్‌ నిగం లిమిటెడ్‌గా పేరు మార్చి కార్పొరేషన్‌ రూపు దిద్దుకొంది. మారుమూల ప్రాంతాలకు, సరిహద్దు ప్రాంతాల్లో, భద్రత, రక్షణ ప్రదేశాలకు విస్తరించిన సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌. భారత దేశంలో 7.5 లక్షల ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌ కలిగి ఉంది.ప్రైవేట్‌ రంగంలోని జియో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌ 3.25 లక్షల కి.మీ, ఎయిర్‌ టెల్‌ 2.5లక్షల కి.మీ, వోడా ఫోన్‌ ఐడియా 1.6 కి.మీ మాత్రమే కలిగి ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో బ్రాడ్‌ బ్యాం డ్‌ ఇంటర్‌ నెట్‌ కనెక్షన్‌ కలిగి ఉన్నవి.బిఎస్‌ఎన్‌ఎల్‌ భారత దేశంలో ని పల్లెటూరు ప్రాంతాల్లో 17,000 నుండి 18,000 టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీలు గల ఏకైక సంస్థ. తన సేవల ద్వారా వచ్చిన సంపాదన తోనే తన ఖర్చులను భరిస్తోంది. 2000 సంవత్సరాల్లో ఏర్పడిన సమయంలో డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ టెలిఫోన్స్‌ సంస్థకు చెందిన 3.25 లక్షల ఉద్యోగుల జీతాలను సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల ను చెల్లిస్తుంది.

టెలికామ్‌ రంగంలో 118కోట్లమొబైల్‌ చందాదా రులు కల్గిన భారత దేశం ప్రపంచంలోనే రెండవది. 75 కోట్లమంది ఇంటర్‌ నెట్‌ చందాదారులు కలిగి ఉండి మొబైల్‌ అప్లికేషన్స్‌ డౌన్లోడ్‌ చేయడంలో రెండవ స్థానం కలిగి ఉంది.బిఎస్‌ఎన్‌ఎల్‌ కారణంగా ప్రపంచంలో ని మిగిలిన డేటా తో పోలిస్తే అతి చౌకగా ప్రజలకు లభిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన టెలి కమ్యూ నికేషన్‌ రంగంలో ప్రైవేట్‌ వ్యక్తుల ప్రవేశం కొరకు 1995లో, 1997 లో మొబైల్‌ సేవలకు అనుమతించిన ప్రభుత్వం, బిఎస్‌ఎన్‌ఎల్‌ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటికీ 2002మొబైల్‌ సేవలకు అనుమతించక పోవడానికి కారణం ప్రభుత్వ రంగంలోకి కార్పొరే ట్‌ శక్తుల ప్రవేశం కొరకు ద్వారాలు తెరిచి బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల కు స్వంచ్చంద విరమణ పథకం ప్రవేశపెట్టి ఉద్యోగులను ఇంటికి పంపడం వెనుక ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం దాగివున్నదని జగద్వితమే. ఈ విధానం కొనసాగితే ప్రజలకు చౌక్‌గా లభించే టెలికమ్యూనికేషన్‌ సేవల ధరలు పెరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం రైల్వే నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు మెల్ల మెల్లగా వైదొలగిన తరువాత టికెట్‌ ధరలు, యూజర్‌ చార్జీలు పెరిగినట్లే ప్రజలకు టెలికామ్‌ సేవలు కూడా సామాన్య ప్రజలు భరించలేని స్థితి నెలకొన గలదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement