Sunday, April 28, 2024

పార్లమెంట్ లో ముగిసిన 50 గంటల నిరవధిక నిరసన.. రెండు రాత్రులు ధర్నాలోనే ‘వద్దిరాజు’

న్యూఢిల్లీ : రాజ్యసభలో ప్రజా సమస్యలపై చర్చ జరపాలన్న ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన 50 గంటల నిరవధిక ధర్నా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది. శుక్రవారంతో ఆందోళన ముగిసిన నేపథ్యంలో జాతీయ మీడియా సైతం దీన్ని ప్రముఖ అంశంగా తీసుకుంది. 50 గంటల నిరవధిక నిరసనలో టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రెండు రోజులు రాత్రంతా ధర్నా శిబిరంలోనే గడిపారు. పార్టీ ఇచ్చిన పిలుపుకు కట్టుబడి మొక్కవోని లక్ష్యంతో పార్లమెంట్ ఆవరణలో నేలపై నిద్రించి తన నిబద్ధతను చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు, జీఎస్టీ భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా స్వామ్యయుతంగా పార్లమెంట్లో చర్చ జరపాలని కోరిన ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. ఇప్పటికే పార్లమెంట్ లో రెండు వారాలుగా ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం తాత్సారం చేసిందని, ఇకనైనా చర్చకు అనుమతి ఇవ్వాలని వద్దిరాజు రవిచంద్ర కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement