Friday, May 3, 2024

ఈ కామర్స్‌కి నిలయంగా తెలంగాణ.. ఫ్లిప్‌ కార్డ్‌ ద్వారా 40 వేల మందికి ఉపాధి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉపాధి కల్పనతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. సంగారెడ్డిలో ప్లిప్‌ కార్డ్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో వర్చువల్‌ పద్ధతి ద్వారా మంగళవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తెలంగాణలో ఇప్పుడు చేస్తున్నది రేపు యావత్‌ దేశం అనుసరిస్తుందని తెలిపారు. ఈ కామర్స్‌ రంగం వేగంగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో ఫ్లిప్‌ కార్డ్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినందుకు ఆ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అతి పెద్ద ఫెసిలిటీ సెంటర్‌…

- Advertisement -

ఫ్లిప్‌ కార్డ్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్పన లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు విజయవంతంగా పని చేస్తున్నాయని చెప్పారు. ఉపాధి కల్పనలో మహిళలకు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఫ్లిప్‌కార్డ్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఇది తెలంగాణలోనే అతి పెద్ద ఫెసిలిటీ సెంటర్‌ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement