Friday, May 17, 2024

మార్కెట్లోకి మ‌రో కొత్త‌ స్మార్ట్ వాచ్ .. అదిరిపోయేలా ఫీచ‌ర్స్‌

ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ మార్కెట్‌లోకి మరో కొత్త వాచ్‌ను రిలీజ్ చేసింది. నాయిస్‌ఫిట్ ఫోర్స్ ప్లస్ పేరుతో మార్కెట్ లో లాంచ్ చేయ‌గా.. ఏ కంపెనీ ఇవ్వలేని ఫీచర్లను నాయిస్ తన ఫిట్ ఫోర్స్ స్మార్ట్ వాచ్‌లో అందిస్తోంది. కేవలం రూ.3999కు అందుబాటులో ఉండే ఈ వాచ్‌ను నాయిస్ వెబ్‌సైట్ లేదా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ జెట్ బ్లాక్, మిక్స్‌డ్ గ్రే, టీల్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్‌లో వచ్చే ఇతర ఫీచర్లు ఇవే!

నాయిస్ ఫిట్ ఫోర్స్ ప్లస్ ఫీచర్లు ఇవే..

నాయిస్ ఫిట్ ఫోర్స్ ప్లస్ వాచ్ ఓ సారి చార్జ్ చేస్తే ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్.
1.46 అంగుళా ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే.
466×466 స్క్రీన్ రిజుల్యూషన్.
500 నిట్స్ పీక్ బ్రైైట్‌నెస్‌.
డైరెక్ట్ కాల్స్ ఆప్ష‌న్.
నాయిస్ బజ్ యాప్ ద్వారా ఈ వాచ్‌లో 10 మంది నంబర్స్ సేవ్ చేసుకునే అవకాశం.
హార్ట్ బీట్ రేట్, ఎస్‌పీఓ2, స్లీప్ మానిటర్, స్ట్రెస్ కాలిక్యులేటర్, బ్రీత్ ప్రాక్టీస్, ఆడవారి కోసం రుతు చక్ర ట్రాకింగ్.
రిమైండర్లు, వాతావరణ సూచనలు
130కు పైగా వాచ్ స్పోర్ట్స్ మోడ్స్, 100కు పైగా వాచ్ ఫేస్‌లు ఉన్నాయి.
నాయిస్ ఫిట్ యాప్‌తో వాచ్‌ను లింక్ చేయడం ద్వారా సులభంగా స్పోర్ట్స్ మోడ్‌లను మార్చుకోచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement