Thursday, May 2, 2024

తెలంగాణ ఛత్రపతి సర్దార్ పాపన్న గౌడ్ : మంత్రి గంగుల

సర్వాయి పాపన్న ఆశయ సాధకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేడు కరీంనగర్ లో సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆయన పౌరుషాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. 300 సంవత్సరాలకంటే ముందే బహుజన రాజ్యం కొరకు గోల్కొండ కోటను అధిరోహించి గోల్కొండ సింహసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేసారు. పాపన్న గౌడ్ ఒక గౌడ కులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పెద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నరని గుర్తు చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement