Wednesday, May 15, 2024

Cowboy Style | తమ్ముడి చెస్ట్​లోకి బుల్లెట్​ దింపాడు.. తుపాకీతో ఆడుతుంటే సడెన్​గా పేలింది!

కౌబాయ్ సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఓక్లహోమాలోని వాల్‌మార్ట్ పార్కింగ్ ప్లేస్​ బయట ఒక టీనేజ్ బాలుడు పొరపాటున తన ఏనిమిదేండ్ల సోదరుడిని ఛాతీపై కాల్చాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు అన్నదమ్ములు తమ తల్లితోపాటు చోక్తావ్‌లోని ఒక దుకాణంలో షాపింగ్‌ చేయడంలో బిజీగా ఉన్నారు. అక్కడే అన్నయ్య ఒక తుపాకీని గుర్తించి ఉత్సాహంతో దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక.. దానితో కౌబాయ్​ రేంజ్​లో ఆడుతుండగా సడెన్​గా పేలింది. ఈ14 ఏళ్ల బాలుడు అనుకోకుండా తన తమ్ముడి ఛాతీపై కాల్చడంతో బుల్లెట్​ దూసుకెళ్లింది.

ఇక.. తుపాకీ కాల్పుల శబ్దం విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే 911కి డయల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు బాలుడి గాయం నుంచి రక్తం కారకుండా ఛాతీపై రెండు బ్యాండేజీలు వేశారు. పోలీసు చీఫ్ కెల్లీ మార్షల్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట చిన్న పిల్లవాడిని హాస్పిటల్​కి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే, అంబులెన్స్ ద్వారా ఓక్లహోమా విశ్వవిద్యాలయం ట్రామా సెంటర్‌లో చేరిస్తే మంచిదని అధికారులు భావించారు.

అయితే.. తుపాకీ తూటా దిగి గాయపడిన ఎనిమిదేండ్ల బాలుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. త్వరలో శస్త్రచికిత్స చేయనున్నట్లు పోలీసు చీఫ్ తెలిపారు. ఇక.. ఆ తుపాకీ ఎవరిది అన్నదానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని, ఇద్దరు అబ్బాయిల తండ్రి ఓక్లహోమా సిటీ పోలీసు అధికారిగా భావిస్తున్నట్టు తెలిపారు. తుపాకీ అతనిదా? మరెవరిది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే.. ఈ కేసులో మరో ట్విస్ట్​ ఏంటంటే.. సంఘటనా స్థలంలో వారి తండ్రి లేరన్న విషయం వెల్లడయ్యింది. మరి ఆ బాలుడు తుపాకీని ఎలా తీసుకొచ్చాడు. అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement