Saturday, September 21, 2024

BJP – కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి జాక్ పాట్ …బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియామ‌కం

ఢిల్లీ – మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి జాక్ పాట్ కొట్టారు.. బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.. ఈ మేర‌కు బిజెపి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. ఆయ‌న‌ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నార‌నే నేప‌థ్యంలో వాటికి చెక్ పెడుతూ, బిజెపి అయ‌న‌కు జాతీయ స్థాయిలో కీల‌క‌ప‌ద‌వి ఇచ్చింది.. మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత రాజ‌గోపాల్ పెద్ద‌గా బిజెపి కార్య‌క్ర‌మాల‌కు దూరంగానే ఉంటున్నారు. అయితే బిజెపిలోనే ఉంటాన‌ని, కాంగ్రెస్ లో చేరేది లేద‌ని ప‌దేప‌దే ఆయ‌న చెబుతున్నారు.. ఏది ఏమైనా రాజ‌గోపాల్ ను బిజెపి గుర్తించి పార్టీలో ప‌ద‌వి ఇవ్వ‌డం విశేషం..

Advertisement

తాజా వార్తలు

Advertisement