Wednesday, May 1, 2024

సాకారమైన ఎమ్మెల్యే పెద్ది కృషి.. నర్సంపేటకు మెడికల్ కాలేజీ మంజూరు

వరంగల్ జిల్లా నర్సంపేటకు మెడికల్ కాలేజీ మంజూరైనట్లు తెలుస్తోంది. జిల్లాకో మెడికల్ కాలేజీ కేటాయింపులో భాగంగా వరంగల్ జిల్లాకు సైతం ఒక మెడికల్ కాలేజీ మంజూరు కాగా.. అది నర్సంపేటలో నిర్మించనున్నట్లు సమాచారం. 100ఎంబిబిఎస్ సీట్లతో ఈ మెడికల్ కాలేజీ మంజూరైనట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీ మంజూరు కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదనే చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో జరిగిన డి హబ్ ప్రారంభోత్సవం లో సైతం మంత్రి హరీష్ రావుకు గుర్తు చేసి ధన్యవాదాలు తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం మెడికల్ కాలేజీ చేరువ అవడంతో ఒకింత సంతోషకరమైన వార్త.

Advertisement

తాజా వార్తలు

Advertisement