Monday, May 6, 2024

Spl Story | ఇది తాగితే నా సామిరంగా.. ఇక బెడ్​లో రెచ్చిపోవాల్సిందేనట!

అది వయాగ్రా లేదా యోగా కావచ్చు.. బెడ్​లో పనితీరును మెరుగుపరచడానికి మగాళ్లు చాలామంది దీనిపై ఆధారపడుతున్నారు. అయితే వయాగ్రా అధికంగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు రెస్క్యూకి దారితీయొచ్చు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంచం మీద కష్టపడుతున్న మగాళ్లు ఒక నిర్దిష్టమైన మోతాదులో పానీయం తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం పొందవచ్చు. అయితే.. ఇక్కడ వాడాల్సింది వయాగ్రానో మరో మెడిసిన్​ వంటివేవీ అక్కర్లేదు. కేవలం బీర్, విస్కీ కాకుండా రెడ్ వైన్ తాగితే ఇక బెడ్​లో రెచ్చిపోయే చాన్సెస్​ వందకు వంద శాతం ఉన్నాయి. మరి ఆ సంగతులు ఏంటో చదివి తెలుసుకుందాం..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

30 సంవత్సరాలుగా నిర్వహించిన పలు అధ్యయనాల ప్రకారం బెడ్‌పై చెమటోడుస్తున్న మగాళ్లు రెడ్ వైన్ తాగడం వల్ల రెచ్చిపోయే చాన్సెస్​ ఉన్నాయి. వారి ఉత్సాహానికి కళ్లెం వేయాల్సిన అవసరం లేకుండా ఎంతో ప్రయోజనం పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పలు అధ్యయనాల ద్వారా నిర్ధారించారు కూడా.. ఈ డ్రింక్​లో పాలీఫెనాల్స్ అని పిలిచే యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల లైంగిక కోరికలు, బెడ్​లో పనితీరును పెంచడంలో సహాయపడతాయి. ఇది మగాళ్ల సంతానోత్పత్తిని, టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

రెడ్ వైన్‌లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్త నాళాలు, గుండె యొక్క లైనింగ్‌ను పోషించడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. లైంగిక అవయవాలు కూడా చాలా యాక్టివ్​ అవుతాయి. ఇటలీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టంగా కనుగొన్నారు. తక్కువ మొత్తంలో రెడ్ వైన్ తాగిన మహిళలు.. తక్కువగా, లేదా అస్సలు తాగని వారి కంటే ఎక్కువ లైంగిక కోరికలను కలిగి ఉన్నారని కనుగొన్నారు. ఇక.. వృద్ధులైన స్త్రీలు ఎక్కువగా మద్యం తాగే అవకాశం ఉన్నందున వారిపై ఈ ప్రభావం మరింత బలంగా ఉందని వెల్లడయ్యింది.

- Advertisement -

ఈ విషయాన్ని క్లినికల్ మెడిసిన్ జర్నల్‌లో రాస్తూ.. వయస్సు అనేది సాధారణంగా లైంగిక పనితీరుతో విలోమ సంబంధం కలిగి ఉంటుందని గుర్తించారు. ఇది రెడ్ వైన్, పాలీఫెనాల్స్ లో ఆల్కహాల్ కంటెంట్ కారణంగా కావచ్చుని తెలిసింది. ఇక.. వైట్ వైన్ తాగిన వారికి లైంగికంగా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. అదే సమయంలో ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం లైంగిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గ్రహించారు. కాబట్టి, రెడ్​ వైన్​ తాగి రెచ్చిపోవచ్చని, దీనికి కొంత జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement