Tuesday, May 7, 2024

టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక – లెఫ్టా?..రైటా?

సిట్టింగ్‌ కోసం కాటేపల్లి యత్నం
మద్దతు కోసం అగ్రనేతలతో భేటీ
బరిలోకి వామపక్షాల అభ్యర్థి
సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్‌
వ్యూహప్రతివ్యూహాలు
టీచర్ల సంఘాల నేతలు పోటీకి సై
16 నుంచి నామినేషన్లు షురూ

హదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధానప్రతినిధి: రాష్ట్రంలో ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల నగారా మోగింది. దీంతో భారత రాష్ట్ర సమితి (భారాస) మద్దతుతో రంగంలోకి దిగే అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నికపై గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్న అధికార పార్టీ భారాస సత్తా చాటేందుకు వ్యూహం రచిస్తోంది. మహబూబ్‌ నగర్‌, రంగా రెడ్డి, #హదరాబాద్‌ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎమ్మెల్సీ జనార్దన్‌ రెడ్డి పదవీకాలం ఈ నెల చివరన ముగు స్తోంది దీంతో ఎన్నికల సంఘం పోలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో గులాబీ పార్టీలో కొత్త సమీకరణలకు దారి తీస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో అధికార పార్టీ ఆచితూచి వ్యవ#హరిస్తోంది. ఈ ఎన్నికల బరిలో భారాస తమ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించి ప్రచారం నిర్వ #హస్తారా లేక ఏదో ఒక ఉపాధ్యాయ సంఘం నుంచి పోటీ చేస్తు న్న గట్టి అభ్యర్థికి మద్దతు ప్రకటించి పోటీలో ఉంచుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది. భారాస, వామపక్ష పార్టీలు సయోధ్య గా వ్యవ#హరిస్తుడండంతో వామపక్ష పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ఈ స్థానంపై గంపెడాశలు పెట్టుకున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వ#హస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. తనకు మద్దతు ఇవ్వాలని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్యనిర్వా#హక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావును కలిసి అభ్యర్థించగా ఎన్నికల నోటి ఫికేషన్‌ వెలువడ్డాక పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని వారు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

భారాసకు అనుబంధంగా పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘం పీఆర్పీయు తరపున అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఈ ఉపాధ్యాయ సంఘం నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్ర వరి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుండగా మర్చి 13న పోలింగ్‌ జరగనుంది. దీంతో కీలక ఉపాధ్యాయ సంఘాలు గత కొన్ని రోజులుగా హదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ ప్రతి ఒక్క ఓటరును కలుస్తూ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వా లని కోరుతున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌ రెడ్డిని భారాస అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మైత్రి బంధం పెంచుకున్న భారాస వామపక్ష పార్టీలు వచ్చే అసెంబ్లి ఆ తర్వాత జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గా లు చెబుతున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగుల వర్గాల్లో ప్రభు త్వంపై ఉన్న వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో తమకు అనుకూలం గా మలుచుకోవాలని రెండు పార్టీలు ప్రణాళిక రూపొందించు కున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వామపక్ష పార్టీలు కూడా తమ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘా ల నుంచి అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాయి. యూటీఎఫ్‌ తరపున మాణిక్‌ రెడ్డి రంగంలోకి దిగడం దాదా పు ఖాయం అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే గత ఎన్నికలలో వామపక్షాలకు భారాసకు సన్నిహత సంబంధాలు లేవు. భారాస, వామపక్షాలు ప్రస్తుతం స్నేహపూర్వకంగా మెలుగుతున్నాయి. దీంతో భారాస బలపరిచే అభ్యర్థి రంగం లో ఉంటారా లేక యూటీఎఫ్‌ అభ్యర్థికి మద్దతిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరో వైపు భారాస అనుబంధ ఉపాధ్యాయ సంఘం నుంచి చెన్నకేశవ రెడ్డిని అభ్యర్థిగా ప్రచారం చేశారన్న ప్రచారం జరుగుతోంది. కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి లేదా మాణిక్‌రెడ్డిల్లో భారాస ఎవరికి మద్దతు ఇస్తుందన్న అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఏడాది కావడంతో అధికారికంగా పార్టీ మద్దతు తెలిపితే పరిణామాలు ఎలా వుం టాయో అన్న చర్చ భారాసలో జోరుగా సాగుతోంది. దీంతో పార్టీ బలపరిచిన అభ్యర్థిని బరిలో ఉంచాలా లేక యూటీఎఫ్‌ తరపున పోటీకి దిగుతున్న అభ్యర్ధికి జై కొట్టాలా అన్న అంశంపై భారాసలో చర్చ జరుగుతోందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement