Thursday, April 25, 2024

వేడుకగా ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌.. హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్ 74వ బ్యాచ్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై.. ట్రైనీ ఐపీఎస్‌ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అంతర్గత భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంద‌న్నారు. గత ఎనిమిదేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకున్నామని, పీఎఫ్ఐ ఉగ్రవాద సంస్థను నిషేధించామన్నారు. దేశంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ప్రజా ప్రతినిధులు ఐదేళ్లకోసారి ఎన్నికవుతారని అదే బ్యూరోకాట్లు ఒకసారి అపాయింట్ అయితే 30, 35 ఏళ్లపాటు ప్రజా సేవలో ఉంటారన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ నేటితో 75 వసంతాలు పూర్తిచేసుకుంది. 74వ పాసింగ్ ఔట్ పరేడ్‌లో 195 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 2021 బ్యాచ్ ఐపీఎస్‌లలో 166 ఇండియా, 29మంది ఫారెనర్స్ ఉన్నారు. 37 మంది మహిళా ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. ఇప్పటికే 46 వారాల కఠోర శిక్షణ పూర్తి అయ్యింది. మొత్తం ఫీల్డ్ ట్రైనింగ్‌తో కలిపి 105 వారాల పాటు శిక్షణ పొందారు. ఇండోర్, ఔట్ డోర్ కలిపి 17 విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందించారు. అకాడమీ డైరెక్టర్‌ ఏఎస్‌ రాజన్ మాట్లాడుతూ.. మరోవైపు ప్రతి ఏడాదికి మహిళా ఐపీఎస్‌లు పెరుగుతూ వస్తున్నారు. ఈ బ్యాచ్‌లో అధికంగా ఇంజనేరింగ్, మెడికల్, సిఎ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల కు ఏడుగురు ఐపీఎస్‌లను కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణకు ఐదుగురు, ఏపీ కాడర్‌కు ఇద్దరు చొప్పున అధికారులను కేటాయించడం జరిగింది. హైదరాబాద్ వాసి శేషాద్రిరెడ్డిని తెలంగాణకు కేటాయించారు. అవినాష్ కుమార్, శేషాద్రిరెడ్డి, మహేష్ బాబా సాహెబ్, శంకేశ్వర్, శివం ఉపాద్యాయ తెలంగాణకు కేటాయించగా… ఏపీకి పంకజ్ కుమార్ మీనా, అంకిత్ మహవీర్‌ల కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement