Saturday, May 11, 2024

రష్య నుంచి బొగ్గు కొనడంలేదున్న టాటా స్టీల్‌..

రష్యాపై ఆంక్షలు విధించిన తరువాత ఏప్రిల్‌ 20 నుంచి బొగ్గు కొనుగోలు చేయలేదని టాటా స్టీల్‌ తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత తాము రష్యాతో వ్యాపారాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ విషయంలో రష్యాపై ఆధారపడకుండా , ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. తాము రష్యా నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఖండించింది.

2022 మార్చిలో 75 వేల టన్నుల బొగ్గు కొనుగోలుపై ఒప్పందం జరిగిందని, దీని ప్రకారమే మే నెలలో బొగ్గు వచ్చినట్లు తెలిపింది. దీని తరువాత టాటా స్టీల్‌ రష్యా బొగ్గు దిగుమతులపై
ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement