Monday, April 29, 2024

ఏఎంబీ మాల్ లో బింబిసార చిత్రాన్ని చూసిన – త‌మిళ స్టార్ హీరో విజ‌య్

హైద‌రాబాద్ లో సంద‌డి చేస్తున్నాడు త‌మిళ స్టార్ హీరో విజ‌య్. హైదరాబాద్ లో ప్రముఖులను కలుస్తూ.. ప్రముఖ ప్రదేశాలు చూస్తూ.. తన షూటింగ్స్ చేసుకుంటున్నాడు. కొన్ని సినిమాలు తప్పించి విజయ్ నటించిన తమళ డబ్బింగ్ సినిమాలన్నీ తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా డైరెక్ట్ తెలుగు సినిమా కూడా స్టార్ట్ చేశాడు విజయ్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న సినిమా వారసుడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ..నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, లాంటి స్టార్స్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈసినిమాకు తమన్ స్వారాలు సమకూర్చుతున్నారు. ఈ షూటింగ్ బ్రేక్ టైమ్ లో విజయ్ టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్ ను సందర్శించారు. విరామంలో భాగంగా నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన రీసెంట్ మూవీ బింబిసారను విజయ్‌ చూసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement