Sunday, April 21, 2024

కారును ఢీకొట్టిన లారీ… మెప్మా పీడీ సతీమణి దుర్మరణం

కారును లారీ ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో మెప్మా పీడీ సతీమణి దుర్మరణం చెందారు. క‌డప శివారులోని పబ్బపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈరోజు కడప మెప్మా పీడీ కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆమె తీవ్రగాయాలతో మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement