Saturday, April 27, 2024

తమిళ హీరో కుమారజన్ ఆత్మహత్య!


కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ తమిళ యువ హీరో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సొంతంగా ఓ సినిమాను నిర్మించి, దానిలో హీరోగా నటించిన కుమారజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండస్ట్రీలో కోరుకున్న గుర్తింపు రాక, మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నటుడు, నిర్మాత కుమారజన్ నమక్కల్ లోని తన ఇంట్లోనే ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో కుమారజన్ ‘సొంతిప్పొమ్ సింతిప్పొమ్’ పేరిట చిత్రాన్ని నిర్మించి, అదే సినిమాలో హీరోగానూ నటించారు. ఈ చిత్రం ఫ్లప్ అయ్యింది. దీంతో కొంతకాలంగా నిరాశలో కూరుకుపోయిన కుమారజన్.. కెరీర్ సరిగ్గా సాగడం లేదని ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కుమారజన్ ఉరేసుకున్న గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు, కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement