Monday, April 29, 2024

మెనీ ఫెస్టివల్స్ వన్ లవ్ – రాధే శ్యామ్ నుంచి ప్రభాస్ న్యూ లుక్

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్స్, లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకొని చిత్రయూనిట్ ప్రభాస్ కు సంబంధించిన మరోసారి కొత్త లుక్ ను రిలీజ్ చేసింది. మెనీ ఫెస్టివల్స్ వన్ లవ్ అంటూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement